రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు.