జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇంచార్జ్ మంత్రి తానేటి వనిత రివ్యూ చేశారు. రివ్యూలో జగ్గయ్యపేట ఎమ్మెల్సీ సామినేని ఉదయభాను సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ అధికారులు, కలెక్టర్ చూడాలి అని ఆమె తెలిపారు. పార్టీలకు అతీతంగా అధికారులు అందరినీ సమానంగా చూడాలి.. వాలంటీర్స్ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి అని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
Read Also: Cat attacks Owner: పిల్లి పులి అవ్వడం అంటే ఇదేనేమో… యజమానికి చుక్కలే!
సంక్షేమ పథకాలు రానివారికి కారణాలు తెలుసుకుని అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. రివ్యూ వల్ల అభివృద్ధి ఏం జరిగింది, పెండింగ్ లో ఉన్నదేంటి తెలుస్తుంది అని ఆమె పేర్కొన్నారు. పనులను ఎలా పూర్తి చేయాలో అధికారులు పరిశీలిస్తారు అని మంత్రి తానేటి వనితి వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.
Read Also: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో దారుణం.. లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి
రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి సీఎం జగన్ సంక్షేమ పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నారు అని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి దగ్గరే పనులు జరిగేట్లు సీఎం జగన్ చేశారని ఆమె అన్నారు. సీఎం జగన్ ను ఓడించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు.. కానీ వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని ఆమె పేర్కొన్నారు.