TS Cabinet: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం అనంతరం.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 11 మంది మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే కేబినెట్ మీటింగ్ కు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు వివరాలను వెల్లడించారు.
Read Also: Earthquake: వనాటులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. వాటి అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తారని.. ముందుగా సోనియా గాంధీ పుట్టినరోజైన ఎల్లుండి 2 గ్యారంటీల అమలు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు పెంపు నిర్ణయాలను సోనియాగాంధీ పుట్టిన రోజు నుంచి అమల్లోకి తీసుకువస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మార్పు కావాలి, మార్పు కోరుకునే వారికి రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఖర్చుల గురించి శ్వేత పత్రం రిలీజ్ చేస్తామని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై వివరాలతో కూడిన అన్నీ అంశాలు తెలపాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు ముందే తెలిపాం.. అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
Read Also: Ram Charan: బ్రేకింగ్.. నెట్ ఫ్లిక్ సీఈఓ తో మెగా ఫ్యామిలీ భేటీ..
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తామని.. ఇందుకోసం అధికారులను ఆదేశించామన్నారు. ప్రణాళికలు లేకుండా విద్యుత్ కొనుగోలు జరిగిందని.. రేపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో రివ్యూ ఉంటుందని తెలిపారు. విద్యుత్ అంతరాయం జరుగకుండా వ్యవసాయంకు ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా అదే రోజున వుంటుందని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా.. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాము.. మంత్రులు, అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారని మంత్రి తెలిపారు. ఈ భేటీలో రైతుబంధు పై చర్చించామని.. ఆర్థిక శాఖ అధికారులు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత రైతు బంధు పై ముందుకు వెళతామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి?.. హామీల అమలుపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!