Seethakka : బీజేపీపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. బీసీల రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని ఫైర్ అయ్యారు. బీసీల సాధికారత కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలన్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని అంశాలపై, ఇతర ప్రభుత్వ పథకాలపై మాట్లాడారు. బడి పిల్లల యూనిఫార్మ్ ల ద్వారా మహిళ సంఘాలకు 30 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు సీతక్క. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లను కూడా చేస్తోందన్నారు. అంబానీ లాంటి కోటీశ్వర్లు నడిపే సోలార్ ప్లాంట్లు కూడా మహిళ సంఘాలకు ఇస్తున్నామని వివరించారు.
Read Also : KTR : మేడిగడ్డమీద కూర్చుని చర్చిద్దాం.. రేవంత్ కు కేటీఆర్ సవాల్..
మా పాలనలో 26 వేల కోట్లు రుణాలు ఇచ్చాం. మహిళ సంఘాల నుంచి 98 శాతం లోన్లు రిపేమెంట్ చేసారు. బ్యాంకర్లు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అద్దె బస్సులను ప్రభుత్వం ష్యూరిటీ మీద తెచ్చి మహిళలకు ఇస్తుంది. అనేక కష్టాలు పడ్డ మహిళా సంఘాలు ఈరోజు కోట్లాది రూపాయల సంపాదించె స్థాయికి చేరాయి. ఆడవాళ్లు కలిసి ఉండరు అనే సామెతలు ఉన్న చోట 67 లక్షల మంది సంఘాల్లో ఐక్యంగా ఉంది శక్తిని చాటుతున్నారు. మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ఇస్తున్నాం. మహిళా సంఘాల వాళ్ళకి రెండు చీరలు ఇస్తున్నాం.. నాణ్యమైన చీర ఇస్తాం. బొంబాయి, సూరత్ నుంచి చీరలు తేవడం లేదు. అటవీ ఉత్పత్తులను మహిళా సంఘాల ద్వారా ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణ మహిళా సంఘాల కృషిని ప్రధాని మన్ కీ బాత్ లో నాలుగైదు సార్లు పొగిడారు అంటూ మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.
Read Also : Ap- Telangana : మొదలైన తెలంగాణ, ఏపీ సీఎంల మీటింగ్..
