Minister Seethakka: యుద్ధ ప్రాతిపదికన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి సీతక్క అన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 19న ఉదయం 7 గంటలకు మేడారం ఆలయాన్ని సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Warangal: అక్రమ సంబంధం అనుమానం.. భర్తపై కత్తితో దాడికి యత్నించిన భార్య..!
వరంగల్ జిల్లా అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఎంతో సహకరిస్తున్నారన్న సీతక్క మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ తో పోల్చుకొని హైదరాబాద్ తర్వాత మరి అంత స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతోటి ఎయిర్ పోర్ట్ ను కూడా ఇక్కడికి తీసుకురావడం.. వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా గారి మీద ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనం అన్నారు.
Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..!