NTV Telugu Site icon

Minister Seethakka: ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్..

Minister Seethakka

Minister Seethakka

ఆదివాసీలకు ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కొమురం భీం అని మంత్రి సీతక్క అన్నారు. కొమురం భీం లేక పోతే తన ఉనికి ఉండేది కాదన్నారు. కొమురం భీం పోరాటంతోనే హక్కులు సాధించబడ్డాయన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే సాగిన ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అనంతరం తన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. లక్ష 60 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చామన్నారు.

READ MORE: Tech Tips: కీబోర్డుపై F – J అక్షరాల క్రింద ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా?

ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూముల విషయం లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. గిరిజనులకు సరైన అవగాహన కల్పించాలని.. ప్రజలపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఐటీడీఏ కేంద్రంగా పాలన పటిష్టం చేస్తామని తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జోడే ఘాట్ వస్తారని…ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రూ. 6 కోట్లు టూరిజం అభివృద్ధికి ఇస్తామన్నారు. కొమురం భీం ప్రాజెక్టును టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, ఇండ్లు హాస్టల్‌ల అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని మరోసారి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామని.. కలెక్టర్ నివేదిక తయారు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కుల గణన జరుగుతుందని.. అధికారులకు మీ సమాచారం ఇవ్వాలని చెప్పారు. నాయక్ పోడు తెగలు మైదాన ప్రాంతంలో ఉన్నారని.. అధికారులు వాస్తవ నివేదిక తయారు చేయాలని సూచించారు.

READ MORE:Israel-Iran Conflict: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్‌పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి..?

సబ్ క్యాస్ట్ చెప్పు కోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదివాసీ చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పెద్దలదన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ముందుకు వెళ్దామని కోరారు. జీ నంబర్ 3, ఆదివాసీ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ సమక్షంలో సమావేశం అయి చర్చిద్దామన్నారు.. ఆడవాళ్ళ జోలికి వస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. మీ సమస్యల పరిష్కారం చేసేందుకు మీ వెంటే ఉంటామన్నారు.