Minister Seethakka: రాష్ట్ర మంత్రి సీతక్క నేడు నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. నోటిఫికేషన్ గురించి ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు. అలాగే నేను కూడా ఎటువంటి తప్పుడు ప్రకటన ఇవ్వలేదు.. నా మాటల్లో మార్పు లేదని స్పష్టతనిచ్చారు. ఈరోజు జరిగే సమావేశంలో ఈ అంశంపై పూర్తి అవగాహన వచ్చే అవకాశముందని మంత్రి తెలిపారు. ఎన్నికలపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగుతామని, అన్ని వర్గాలను ప్రతినిధ్యం కలిగించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
Read Also: Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా కేంద్ర ప్రభుత్వం.. మంత్రి హాట్ కామెంట్స్..!
ఇది ఇలా ఉండగా.. మంత్రి సీతక్క మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నారు.. వీలైనంత త్వరగా జైలుకు పంపించాలని మా సీఎంను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్, కవిత మధ్య పోటీ ఉంది.. కవిత జైలుకు పోయివచ్చి బీసీ ఎజెండా ఎత్తుకుంది.. నేను వెనకబడ్డా అని కేటీఆర్ కూడా జైలుకు వెళ్లే పథకం రచించాలని అనుకుంటుంన్నాడు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నాడు. ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలనుకుంటుంన్నాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Read Also: Mahesh Kumar Goud: మంత్రి పొంగులేటి పై చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్..!