కొండాయి గ్రామంలో పర్యటించిన మంత్రి వరదలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ బరోసా ఇచ్చారు. అనంతరం వరద బాధితులకు ఆమె ఆహారం అందించారు. రవాణా సౌకర్యం కొరకు కూలిపోయిన బ్రిడ్జినీ పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం కలిగింది. మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ (85) ఈ రోజు ఉదయం పరమపదించారు. అయితే గత కొంతకాలంగా లింగ్యా నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క-సారక్క జాతర పర్యవేక్షణలో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె…