Site icon NTV Telugu

Jaishankar: ఉగ్రవాదంపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు..

S Jaishankar

S Jaishankar

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌ను దుర్మార్గపు ఆలోచనలను బయటపెట్టారు. న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే ఉగ్రవాదానికే బలవుతుందన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఆ దేశంలోని పలువురు ప్రజలు బహిరంగంగా.. గర్వంగా చెబుతున్నారన్నారు.

READ MORE: Realme NARZO 80x 5G: కేవలం రూ.13,999లకే 6.72 అంగుళాల డిస్ప్లే, IP69 రేటింగ్స్, 6000mAh బ్యాటరీ

‘‘ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ల కట్టినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని వారే చెబుతున్నారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని పాక్ ప్రజలే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇవి ఊహాగానాలు కాదు.. వారు గర్వంగా చెప్తున్న విషయమిది. మీరొక టెర్రరిజం ఇండస్ట్రీని ప్రారంభిస్తే.. అదే మిమ్మల్ని దెబ్బతీస్తుందని ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల నేడు పాక్‌ మూల్యం చెల్లించుకుంటోంది. నేను మీతో ఉదయం మంచిగా ఉండి.. రాత్రికి మీ ఇంటిపై వచ్చి దాడి చేస్తే మీకు ఓకేనా..? అలాంటివారితో కలిసి ఉంటారా..?’’ అని విదేశాంగమంత్రి ప్రశ్నించారు.

READ MORE: JR NTR : మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం కలిచివేసింది : జూనియర్ ఎన్టీఆర్

అదే సమయంలో, 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వూర్ రాణాను అమెరికా అప్పగించడం గురించి ఆయన మాట్లాడారు. అమెరికా న్యాయ ప్రక్రియ నిర్ణయాన్ని భారతదేశం స్వాగతిస్తుందని జైశంకర్ అన్నారు. ‘తహవ్వూర్ రాణా కేసులో కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అమెరికన్ న్యాయ ప్రక్రియ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం.” అని ఆయన సమాధానమిచ్చారు. బలూచిస్తాన్‌లో కొనసాగుతున్న అశాంతి గురించి అడిగినప్పుడు.. విదేశాంగ మంత్రి దానిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. బలూచిస్తాన్‌లో చాలా గందరగోళ పరిస్థితి ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ సమయంలో ఆ అంశంపై మాట్లాడక పోవడమే ఉత్తమమన్నారు.

Exit mobile version