Realme NARZO 80x 5G: కేవలం రూ.13,999లకే 6.72 అంగుళాల డిస్ప్లే, IP69 రేటింగ్స్, 6000mAh బ్యాటరీ
- కేవలం రూ.13,999లకే Realme NARZO 80x 5G మొబైల్.
- 6.72 అంగుళాల డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- P68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు, 6000mAh బ్యాటరీ, 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP పోర్ట్రయిట్ కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా
- సైడ్ - మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB Type-C ఆడియో, సూపర్ లినియర్ స్పీకర్ వంటి ఫీచర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme NARZO 80x 5G: రియల్‌మీ కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్లైన NARZO 80x 5G, NARZO 80 Pro 5G లను నేడు (ఏప్రిల్ 9)న భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించినట్టుగానే.. ఈ ఫోన్‌లు శక్తివంతమైన ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా NARZO 80x 5G ధరకు ఎక్కువ స్పెసిఫికేషన్లనే అందించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే..
ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఇవ్వబడింది. ఇది 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో పనిచేస్తుంది. ఫోన్ డిస్‌ప్లే గరిష్ఠంగా 680 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. Speed Wave Designతో 7.94mm స్లిమ్ బాడీ, IP68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులోని SonicWave Water Ejection టెక్నాలజీ ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. ఈ ఫోన్ లో శక్తివంతమైన MediaTek Dimensity 6300 SoC (6nm) ప్రాసెసర్ వాడబడింది. అలాగే గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPU కలదు. ఫోన్‌లో 6GB లేదా 8GB LPDDR4x RAM, అలాగే 128GB స్టోరేజ్ ఇవ్వబడింది. ఇది 2TB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
Read Also: Jaat : తెలుగులోనూ ‘జాట్’.. ఎప్పుడంటే?
ఇక మొబైల్ కెమెరా సెటప్ చూసినట్లయితే ఇందులో.. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా ఉంది. ఇది OMNIVISION OV50D సెన్సార్ ఉపయోగించి తీయడంతో ఫోటోలు మంచి క్వాలిటీతో వస్తాయి. అలాగే 2MP పోర్ట్రయిట్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. Android 15 ఆధారంగా నిర్మించబడిన realme UI 6.0, సైడ్ – మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB Type-C ఆడియో, సూపర్ లినియర్ స్పీకర్, 6000mAh బ్యాటరీ, 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తాయి. ఈ మొబైల్ డీప్ ఓషన్, సన్ లిట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో వస్తోంది.
ఇక ధరలు, లభ్యత విషయానికి వస్తే.. 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,999, 8GB + 128GB వేరియంట్ ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫోన్ లాంచింగ్ ఆఫర్ కింద మొబైల్ పై రూ.1500 ప్రత్యేక డిస్కౌంట్ కూడా కలిగి ఉంది. మొత్తంగా ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇది మిడ్-రేంజ్ కేటగిరీలో బాగా పోటీ ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్, ఇంకా పటిష్టమైన నిర్మాణం ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..