అమెరికా అధ్యక్షుడు టెర్రరిజాన్ని వ్యతిరేకించారు.. కానీ పాకిస్తాన్ ను తప్పుబట్టలేదు అని నారాయణ పేర్కొన్నారు. ట్రంప్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా.. భారత ప్రధాని ఒక్కమాట మాట్లాడడం లేదు.. ట్రంప్ నేనే ఆపాను యుద్ధాన్ని అంటాడు.. మన ప్రధాని నోరు తెరవడు.. ఎందుకంత భయం.. బానిస లాగా ఎందుకు భావించడం అని అడిగారు.
ప్రపంచంలో ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే సంస్థ FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. భారతదేశంలోని రెండు ప్రధాన కేసులైన 2019 పుల్వామా దాడి, 2022 గోరఖ్‌నాథ్ ఆలయ దాడిని ఎఫ్‌ఏటీఎఫ్ ప్రస్తావించింది. ఈ సంఘటనలలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది. పుల్వామా దాడిలో ఐఈడీ (IED)…
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్‌తో జరిగిన సంభాషణలో ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌ను దుర్మార్గపు ఆలోచనలను బయటపెట్టారు. న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే ఉగ్రవాదానికే బలవుతుందన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఆ దేశంలోని పలువురు ప్రజలు బహిరంగంగా.. గర్వంగా చెబుతున్నారన్నారు.