అసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించిన సాకేత్ మైనేని కి మంత్రి రోజా తో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. సాకేత్ చాలా అదృష్టవంతుడని, సక్సెస్ అయిన వారు ఎవరూ పూలబాటలో రాలేదన్నారు. టెన్నిస్ చాలా ఖర్చుతో కూడుకున్న క్రీడ అని, 12 సంవత్సరాలుగా సాకేత్ పతకాలు సాధిస్తున్నారని, 9 సంవత్సరాల గ్యాప్ తరువాత కూడా సిల్వర్ సాధించారన్నారు. ఏషియన్ గేమ్స్ లో 107 పతకాలు మన దేశానికి వచ్చాయని ఆమె అన్నారు. మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అధిక పతకాలు సాధించారని, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్టు నేను క్రీడా మంత్రి అయిన తరువాత ఇన్ని పధకాలు సాధించామన్నారు.
Also Read : MAD : మ్యాడ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..
అంతేకాకుండా.. ‘త్వరలో సాకేత్ మైనేనికి ఉద్యోగం, అకాడమీ ల్యాండ్ కూడా ఎన్నికల లోపే చేస్తాం. క్రీడాకారుడి కులం, మతం, పార్టీ చూడకుండా సహకరించాలి. గత ప్రభుత్వం చేసిన అన్యాయం మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాం. ఎవరో చేసిన తప్పుకు రాష్ట్రం విడిపోయి అనాధలుగా మిగిలిపోయాం. ఆడినా ఓడినా రికార్డుల్లో ఉంటారు.. గెలిస్తే చరిత్రలో ఉంటారు. చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరం. గెలుపోటములు లైఫ్ లో సహజం…ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తాం.’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
Also Read : Afghanistan Earthquake: ఆఫ్ఘాన్ భూకంపంలో 1000కి పైగా మృతుల సంఖ్య