టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మ్యాడ్’.సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.మ్యాడ్ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు.మ్యాడ్ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్ మరియు గోపికా ఉద్యాన్ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే రఘుబాబు, రచ్చరవి, మురళిధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషించారు. మ్యాడ్ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంటోంది. అలాగే సినిమా బాగుందని టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి.
.
అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు హ్యాపీ డేస్, జాతి రత్నాలు వంటి సినిమాలతో మ్యాడ్ చిత్రాన్ని పోలుస్తున్నారు . మ్యాడ్ సినిమా కు మంచి ఆదరణ రావడం తో ఓటీటీ విడుదల వివరాలు ఆసక్తిగా మారాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ మూవీ డిజిటల స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకు సొంతం చేసుకుందని సమాచారం.అంతేకాకుండా మ్యాడ్ చిత్రాన్ని థియేటర్ల లో విడుదలైన నాలుగు వారాల్లో విడుదల చేయాలని మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.. అంటే అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ సినిమా నవంబర్ మొదటి వారంలో ఓటీటీ లోకి రానుందని సమాచారం.. కాగా మ్యాడ్ సినిమా విజయం ఇటీవల సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు మేకర్స్. సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ ఇంతటి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.