Ponnam Prabhakar: సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు లేదు!
- ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదు
- బీసీలకు న్యాయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది
- కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే మార్గదర్శకంగా కులగణన సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాంగ్ డైరెక్షన్‌లో పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని.. ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నామని ఎద్దేవా చేశారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండన్నారు. బీసీలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.
కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘దేశంలోనే మార్గదర్శకంగా కులగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఎవరి లెక్క ఎంతో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పారు. రాంగ్ డైరెక్షన్‌లో పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదు. కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ అపిడపిట్ ధాఖలు చేసింది. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నాం. ప్రణాళిక సంఘం ఆద్వర్యంలో కులగణన సర్వే చేశాం. ఇప్పుడైనా మీ వివరాలు ఇవ్వండి.. అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు లేదు’ అని అన్నారు.
Also Read
Also Read: Tollywood: చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ మామను టచ్ చేసేదెవరు?
‘బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండి. నిర్ణయం నుంచి నివేదిక దాకా, నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. బీసీలకు న్యాయం చేసేలా కృషి చేస్తున్నాం. మేదావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలలో ముస్లీం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తది కాదు. అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ క్రిందకు నెట్టవద్దు. ఎర్ర చొక్కా వెసుకున్న వారంతా నక్సల్స్ అనడం సరైన పద్దతి కాదు. ప్రగతిశీల భావాలు కలిగిన నేను నిన్న నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నా. అంతమాత్రాన నేను నక్సలైట్ అవుతానా?’ అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!