Minister Peddireddy: అమూల్ చేతికి విజయ డైరీ.. లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం.. రైతులకు మేలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Peddireddy: అమూల్ సంస్థకు విజయ డైరీని అప్పగించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. జులై 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయ డైరీని ప్రారంభిస్తారని తెలిపారు.. చిత్తూరు విజయ డైరీకి రూ.12 కోట్లు బకాయిలు ఉన్నాయి.. వాటిని త్వరలో చెల్లిస్తాం అని ప్రకటించారు. ఇప్పటికే పాడి రైతులకు ఐదు నుంచి పది రూపాయలు పెరిగాయి.. అమూల్ రాకతో చిత్తూరు జిల్లాతో పాటు పక్క జిల్లా పాడిరైతులకు లీటర్ కు పది రూపాయలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వెల్లడించారు.. ఇక, విద్యుత్ భద్రత వారోత్సవాలను ఏటా నిర్వహిస్తున్నాం.. నాయణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తున్నాం.. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం.. విద్యుత్ అంతరాయాలు లేకుండా అందిస్తున్నాం.. జూన్ నెలలో కూడా విద్యుత్ వినియోగం పెరిగిందని.. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా సిఎం జగన్ ఆదేశాలకు విద్యుత్ అందించామని వెల్లడించారు.
Read Also: Delhi Cabinet: ఢిల్లీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. అతిషికి ఫైనాన్స్, ప్లానింగ్, రెవెన్యూ శాఖలు!
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
కొన్ని రాజకీయ పార్టీలు విద్యుత్ అంతరాయాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.. ఎల్లో మీడియా ప్రతిపక్షాలకు వంతు పాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న ఆయన.. జూన్ నెలలో 260 మిలియన్ యునిట్లు రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం జరిగింది.. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ అందించిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్న ఆయన.. షుగర్ ఫ్యాక్టరీ సమర్థవంతంగా నిర్వహించలేనప్పుడు ఆ స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సీఎం హామీ ఇచ్చారని.. సిఎం హామీ మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తాం.. షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం 32 కోట్ల బకాయిలు త్వరలో చెల్లిస్తామని ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..