Minister Narayana: ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.. తుఫాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ సమీక్ష
- ఏపీలో తుఫాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ సమీక్ష
- మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్
- చెన్నై-నెల్లూరు మధ్య ఈ నెల 17న తుఫాన్ తీరం దాటుతుందని అంచనా
- ముందు జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఏపీలో తుఫాన్ పరిస్థితులపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి జిల్లాల్లో తుపాన్ ప్రభావం ఉంటుందని సమాచారం వచ్చిందన్నారు. చెన్నై- నెల్లూరు మధ్య ఈ నెల 17న తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. దీంతో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంబంధిత అధికారులతో చర్చించారన్నారు. ఆయా మున్సిపాలిటీలలో తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇచ్చామన్నారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించామన్నారు.
Read Also: AP Liquor Shops Lottery: లక్కంటే ఆయనదే.. మద్యం షాపుల లాటరీలో ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు!
Also Read
బుడమేరుకు వచ్చిన వరదలతో ఎన్నో అనుభవాలు వచ్చాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను రూపొందించామన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. నిత్యావసరాలను ముందు జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని చెప్పామన్నారు. అవసరమైతే తుపాన్ ప్రభావం లేని మునిసిపాలిటీల నుంచి సిబ్బందిని పిలిపిస్తామని మంత్రి తెలిపారు. విజయవాడలో కూడా ఇదే విధానాన్ని అనుసరించామన్నారు. సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేశామని.. అందువల్లే అంటువ్యాధులు రాలేదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, సంబంధిత అధికారులు ఖాళీ చేయాలని చెబితే వెంటనే తరలివెళ్లాలని ప్రజలకు సూచించారు. అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. తుఫాన్ వల్ల వీలైనంత తక్కువ నష్టం కలిగేలా చూస్తామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా సిద్ధం చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!