PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- భారత జీడీపీ వృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు..
- ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’ అంటూ ప్రధాని మోడీ సెటైర్లు..
- 2013, 2026 భారత వృద్ధిపై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత తాజా జీడీపీ గణాంకాలపై విమర్శలు చేస్తున్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. భారత్ 7.8 శాతం త్రైమాసికి వృద్ధిరేటును కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 2013లో ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’లో ఉన్న భారత్‌ను ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చామని అన్నారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో శనివారం మోదీ ప్రసంగించారు.
2013లో భారత్‌ను ప్రపంచంలోనే ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’గా భావించేవారని, ప్రపంచ ఆర్థిక షాక్‌లకు గురయ్యే ఐదు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉండేదని, ఇప్పుడు వారే 7.8 శాతం వృద్ధి రేటను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 2013లో భారత్‌పై ప్రతికూల దృక్పథంతో ఉన్నారు ఇప్పటికే అదే వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘‘వారికి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీగానే ఉంటుంది. నేను గ్లాస్ గురించే మాట్లాడుతున్నాను. మరేదైనా ఖాళీగా ఉండటం గురించి కాదు’’ అంటూ సెటైర్లు వేశారు. భారత్ ఎంత మంచి స్థితిలో ఉన్నా కొందరు లోపాలు వెతుకుతూనే ఉంటారనే అర్థంతో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
2013లో తాను SRCCలో చేసిన ప్రసంగంలో ‘‘హాఫ్ ఫిల్లడ్ గ్లాస్’’ను మరోసారి ప్రస్తావించారు. అప్పట్లో కొందరు గ్లాస్ సగం నిండి ఉన్నట్లు, మరికొందరు సగం ఖాళీగా ఉన్నట్లు చూస్తారని, తాను మాత్రం దాన్ని పూర్తిగా నిండిన గ్లాస్‌గా చూస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2013 నాటి ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ.. బలహీనమైన రూపాయి, దాదాపుగా 10 శాతం ద్రవ్యోల్బణం, రికార్డ్ స్థాయి కరెంట్ అకౌంట్ లోటు, పారిశ్రామిక వృద్ధి మందగించడం, అవినీతి ఆరోపణలు, ‘పాలసీ ప్యారలసిస్’ వంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. మేక్ ఇన్ ఇండియానున అప్పట్లో చాలా మంది ఎగతాళి చేశారని, 2014లో భారత్ తనకు అవసరమైన మొబైల్ ఫోటన్లలో ఎక్కువ భాగాలను దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా విలువైన మొబైల్ హ్యాండ్ సెట్లను ఎగుమతి చేసే స్థాయికి చేరిందని మోడీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?