ఏపీలో తుఫాన్ పరిస్థితులపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి జిల్లాల్లో తుపాన్ ప్రభావం ఉంటుందని సమాచారం వచ్చిందన్నారు.