Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కొత్త నిబంధనలను రూపొందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టాల సవరణ చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 28 నుంచే ఈ చట్ట సవరణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ జీవో 210ను విడుదల చేయగా.. మేయర్ , కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ మరో జీవో 211ను జారీ చేసింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్ ధరలను నిర్ణయించారు.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు డిపాజిట్ మొత్తాన్ని రూ. 5,000గా, ఎస్సీ, ఎస్టీ , బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ. 2,500గా ఖరారు చేశారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను మాత్రమే దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
అభ్యర్థుల పారదర్శకతను పెంచేందుకు గాను నామినేషన్ సమయంలో తమపై ఉన్న నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటరీ అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి చేశారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత కఠినంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిబంధనలను అమలులోకి తెస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించినా లేదా అక్రమాలకు పాల్పడినా సదరు ఓటును రద్దు చేసే అధికారాన్ని ప్రిసైడింగ్ అధికారికి కల్పించారు. పరిస్థితిని బట్టి బ్యాలెట్ పేపర్‌ను వెనక్కి తీసుకునే సర్వాధికారాలు కూడా అధికారులకే అప్పగించారు.
మరోవైపు అంధులు, వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా సహాయకుడిని వెంట తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే సదరు సహాయకుడికి 18 ఏళ్లు నిండి ఉండాలని, అలాగే ఒక వ్యక్తి కేవలం ఒక ఓటరుకు మాత్రమే సహాయకుడిగా ఉండాలనే కఠిన నిబంధనను విధించారు. ఈ నూతన సంస్కరణల ద్వారా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిష్పాక్షికంగా మరియు సజావుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!