Nara Lokesh: స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచ్.. మాది అల్లరి బ్యాచ్!
- స్కూలులో పరీక్ష, అసెంబ్లీలో ప్రశ్నల్లో ఏది కష్టం?
- స్కూల్ డేస్‌లోనేను లాస్ట్ బెంచ్, అల్లరి బ్యాచ్
- చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా
- విద్యార్థుల సరదా ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కూల్ డేస్‌లో తనది లాస్ట్ బెంచ్ అని, తమది అల్లరి బ్యాచ్ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. స్కూల్లో పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని పేర్కొన్నారు. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి, సీఎం నారా చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ తనకు ఇష్టమైన కొటేషన్ అని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో మంత్రి భేటీ అయ్యారు.
‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమంలో పదోతరగతి ఉత్తమ విద్యార్థులకు సత్కార కార్యక్రమం సందర్భంగా మంత్రి నారా లోకేష్, విద్యార్థులకు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. విద్యార్థులు అడిగిన పలు సరదా ప్రశ్నలకు మంత్రి ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. మీకు స్కూలులో పరీక్షలు కష్టంగా ఉండేవా? లేదా అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా? అని చీరాలకు చెందిన సంతోష్ ప్రశ్నించాడు. అందుకు పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని మంత్రి బదులిచ్చారు. ‘అసెంబ్లీ ప్రశ్నలను ఎదుర్కోవడం పూర్తిగా భిన్నమైనది. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజూ నాకు మూడు ప్రశ్నలు వచ్చాయి. వాటికి సమాధానం చెప్పేందుకు ఎంతో ప్రిపేర్ కావాల్సి వచ్చింది. స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచి, మాది అల్లరి బ్యాచ్’ అని లోకేష్ సరదాగా సమాధానమిచ్చారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్!
‘ఏపీలో విద్యా సంస్కరణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ చేస్తాం. కష్టపడి పనిచేయడంలో సీఎం చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలి. మంచి మార్కులు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలి. సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం’ అని విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ అన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!