Amigos: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్.. మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమిగోస్ అంటే.. ఫ్రెండ్స్ అని అర్ధం.. టైటిట్ తోనే ఆసక్తి పెంచిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమా కోసం తన బాబాయ్ బాలకృష్ణ రొమాంటిక్ సాంగ్ నే రీమిక్స్ చేశాడు. ఇప్పటికీ టాప్ 10 రొమాంటిక్ సాంగ్స్ లో ఒకటిగా కొలువుతీరుతున్న ఎన్నో రాత్రులొస్తాయి కానీ సాంగ్ ను అబ్బాయ్ ఈ చిత్రం కోసం ఎంచుకున్నాడు. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యి అదరగొట్టింది. ఫుల్ సాంగ్ ను ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉండగా.. కళ్యాణ్ రామ్ అన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగోని కారణంగా వాయిదా వేశారు.
Pawan Kalyan: ఏమయ్యా.. సుజీత్.. ఆయన రిజెక్ట్ చేస్తే ఈయనకు చెప్పావా..?
ఇక తాజాగా నేడు ఈ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ తో పాటు వీడియో కూడా ఆద్యంతం ఆకట్టుకొంది. బాబాయ్ స్టెప్స్ కు అబ్బాయ్ ఎంతో చక్కగా స్టెప్స్ వేసి అలరించాడు. ఆ సాంగ్ లో బాలకృష్ణ, దివ్య భారతి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎంత హీట్ తెప్పించిందో.. ఇప్పుడు కళ్యాణ్ రామ్, ఆషికా మధ్య కూడా అదే కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యినట్లు కనిపించింది. ముఖ్యంగా ఆషికా అందాలను ఆరబోయడంలో ఎక్కడా తగ్గలేదు. ఇక కళ్యాణ్ రామ్ కూడా రొమాన్స్ చేయడంలో బాబాయ్ ను మించిపోయాడు. సిక్స్ ప్యాక్ తో మంచి ఫిట్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. ఇక సంగీతం విషయానికొస్తే వేటూరిని మరోసారి గుర్తుచేశారు. ఈ కాలంలో రొమాంటిక్ లిరిక్స్ కు.. అప్పుడు వేటూరి రాసిన లిరిక్స్ ఎంతో వ్యత్యాసం ఉందని ఈ సాంగ్ చెప్పకనే చెప్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఫిబ్రవరి 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అమిగోస్ తో కళ్యాణ్ రామ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.