ప్రధాని మోడీని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల.. సోమవారం ప్రధాని మోడీని కలిశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని సత్య నాదెళ్ల ప్రకటించారు.
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది.
భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సత్య నాదెళ్లతో ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.