రెండు నెలల్లో ఎలక్షన్ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉంటాయని, కేసీఅర్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ఉద్ఘాటించారు. అంతేకాకుండా.. ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసునని ఆయన అన్నారు. పని చేసే వాళ్ళను ప్రజలు వదులు కుంటారు అని నేను అనుకోనని ఆయన వ్యాఖ్యానించారు. కోనే వాళ్ళు ఉంటేనే రియల్ ఎస్టేట్ వాళ్ళు కడుతరు కదా ? ఒక రంగం తో మరో రంగం ముడిపడి ఉందన్నారు. ఈ దేశానికి బువ్వ పెడుతున్న నాలుగు అయిదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కేటీఆర్ అన్నారు.
Also Read : CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సమావేశం.. అధికారులకి కీలక ఆదేశాలు
అమెరికాకు చెందిన క్వాల్‌కామ్, గ్రిడ్ డైనమిక్స్ సంస్థ సహా అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన అన్నారు. నగరంలో పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ బాష్ ముందుకొచ్చిందని, గూగుల్ కూడా ఇక్కడ అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోందన్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నగరానికి వస్తోందని, భారత్ కంపెనీ ఎల్‌టీఐ మైండ్ ట్రీ కంపెనీ వరంగల్‌లో పెట్టుబడులు పెడుతోందన్నారు.’సైబర్ నేరాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తెస్తున్నాం. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ కేంద్రం ఈ ఏడాది వస్తుంది. మరో రెండేళ్లలో డజోన్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ వస్తోంది. ఐటీ రంగం దూసుకెళ్లేందుకు మా బృందం బాగా పనిచేస్తోంది’’ అని మంత్రి కేటీఆర్ వివరించారు.
Also Read : BP Monitor: మీరు బీపీ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తున్నారా.. ఇక అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ తో ఇంట్లోనే చెకప్