మంచిర్యాల జన్నారంలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనాడు కరెంట్ ఉంటే వార్త… ఇప్పుడు కరెంట్ పొతే వార్త అని ఆయన అన్నారు. కరెంట్ కోసం కాంగ్రెస్ పాలన లో కాల రాత్రి లే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కరెంట్ చూపించు అని రేవంత్ రెడ్డి అంటున్నారని, కరెంట్ కనబడదు.. కాంగ్రెస్ వాళ్ళు వైర్లు పట్టుకోండన్నారు మంత్రి కేటీఆర్. ఏం పార్టీ..కాంగ్రెస్ పార్టీ .. వందల మందిని చంపిన కాంగ్రెస్ ను మన నెత్తిన పెట్టుకుందామా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ కాదు.. 11 ఛాన్స్ ఇచ్చారు .. ఏం చేసారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నోటికి ఎంత అంతే మాట్లాడుతున్నారని, 2 వందలు పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు 4 వేలు ఇస్తారా అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Also Read : World Cup 2023 Final: ఫైనల్ పోరులో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువున్నాయంటే..!
కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడైనా రైతు బంధు ఆలోచన వచ్చిందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన లో సర్కార్ ఆసుపత్రికి వెళ్ళక పోయేదని, కానీ ఇప్పుడు సర్కార్ ఆసుపత్రిలో ప్రసవం కావాలని పోతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కు చెందిన ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద వాళ్లు వస్తున్నారని, 15 లక్షలు వచ్చిన వారు బీజేపీకి ఓటు వేయండన్నారు. రాని వాళ్ళు బీఆర్ఎస్ కు వేయండని మంత్రి కేటీఆర్ కోరారు. అంతేకాకుండా.. మోడీ, బీజేపీ పచ్చి మోసగాళ్ళు. ఢిల్లీ పార్టీలు తెలంగాణ లో ఎందుకు ఉండాలి. 58 ఏళ్లు సతాయించింది ఢిల్లీ వాళ్ళు. బీజేపీ,కాంగ్రెస్ నేతల్ని ఉద్దేర గాల్లని తెచ్చుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ బిజేపి నేతలకు చేవ లేదా… దద్దమ్మలు, బీ ఫార్మ్ కావాలంటే ఢిల్లీ కి పోవాలి. దరిద్రానికి నేస్తం …హస్తం. మతం, కులం కూడు పెట్టదన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : BJP: 3 రాష్ట్రాల్లో గెలుపు మాదే, తెలంగాణలో… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు..