Ravi Prakash Bodapati: వినూత్నమైన కథతో తెరకెక్కిన సినిమా ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’. గతంలో ఛార్మీ తో జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ‘మంత్ర’ మంచి విజయాన్ని సాధించింది. అదే సంస్థ ఆ మధ్య అనుపమా పరమేశ్వరన్ తో ‘బట్టర్ ఫ్లై’ మూవీని నిర్మించింది. ఇప్పుడు తాజాగా ‘మంత్ర’ సినిమా రచయిత రవి ప్రకాశ్ బోడపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, థ్రిల్లర్ జానర్ లో ‘ ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ సంస్థ ద్వారా విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే విడుదలచేసిన ఈ మూవీ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్, యాక్షన్ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ మర్డర్ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్ లో అన్ని కోణాల్లో జర్నలిస్టులు, పోలీసులు ఇన్వెస్ట్ గేషన్ చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Minister Puvvada Ajaykumar: లకారంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తారక్ తో మంత్రి అజయ్ భేటీ
రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రంలో నిహాల్ కోదాటి హీరోగా, దృషికా చందర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగవల్లీ, మెహెర్ శ్రీరామ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రాణం పోసేది మ్యూజికే! ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను గిడియన్ కట్టా అందించారు. దీనికి అమర్ దీప్ గుత్తుల డీఓపీగా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ తో మెస్మరైజ్ చేశారు. ‘చాలా వైవిధ్యమైన కథతో నేటి తరానికి నచ్చేలా ‘ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ సినిమాను తెరకెక్కించామని, యువతకు కావల్సిన అన్ని అంశాలతో పాటు ఓ మంచి సందేశం ఈ సినిమాలో ఉంటుంద’ని మేకర్స్ తెలిపారు.