Site icon NTV Telugu

Minister KTR : కేంద్రం చేయాల్సిన పని చేయకుండా మాకు ఉపదేశాలు ఇస్తే ఎలా

Minister Ktr Speech

Minister Ktr Speech

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. నేడు బడ్జెట్‌ సమావేశాల్లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్రం చేయాల్సిన పని చేయకుండా మాకు ఉపదేశాలు ఇస్తే ఎలా అని వ్యాఖ్యానించారు. ITIR మధ్య బహిరంగ కు చర్చకు సిద్ధమా అని రఘునందన్ రావు అన్నారని, ITIR ను UPA ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు మంత్రి కేటీఆర్‌. ITIR పై కేంద్రం విధానం ఏంటో చెప్పదని, 2018 లో NDA ప్రభుత్వం ITIR ను రద్దు చేసిందన్నారు. ITIR ను రద్దు చేసింది మోడీ సర్కార్… ఇక్కడ మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడి ఐటీ ఉద్యోగాలు రావాలి అంటారన్నారు. మేము పునాదులు వేద్దాం.. నిర్మిద్దాం అంటున్నామని, ఒకరు పేల్చుతం అంటారు.. ఇంకొకరు కూల్చుతం అంటారు అని మంత్రి కేటీఆర్‌ విపక్షాలపై మండిపడ్డారు.

Also Read : Shahrukh Khan: షారుఖ్ వాచ్ ధర.. ఒక కుటుంబం బిందాస్ గా బతికేయొచ్చు

ఇలాంటి అరాచక శక్తులను ప్రజలు గమనించాలని, బుద్ది చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ ఒకాయన సచివాలయంను కూలగొడతానని అంటున్నారని, పేలుస్తాం కులుస్తామని విపక్ష నేతలంటున్నారన్నారు. మా ప్రతిపక్షాలకు అనుమానాలు ఎక్కువ అంటూ చురకలు అంటించారు మంత్రి కేటీఆర్‌. ఒకాయన సచివాలయాన్ని కూలగొడతానని అంటున్నారట, మేము నిర్మాణాలు చేద్దాం… పునాదులు తవ్వాలని అనుకుంటున్నాం, వాళ్ళలో ఒకాయన సమాధులు తవ్వుదామంటారు అని వ్యాఖ్యానించారు. మరొక ఆయన బాంబులు పెట్టి పేల్చుతం అంటారు. వీళ్ళ చేతిలో రాష్ట్రం పెడితే ఏమవుతుందో ఆలోచించాలని కోరుతున్నా, పచ్చని తెలంగాణను పిచ్చోళ్ళ చేతిలో పెట్టవద్దని ప్రజలు కోరుతున్నా’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Telangana Martyrs’ Memorial : తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం

Exit mobile version