Kantara 2 : షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది చిన్న సినిమా గా విడుదలయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యం ఆధారంగా కన్నడ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించాడు.ఈసినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కాంతార మూవీ విడుదల అయిన అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుని .. అదిరిపోయే కలెక్షన్స్ ను కూడా సాధించింది.ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.,దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాకు రెండవ భాగం తెరకేక్కించేందుకు సిద్ధం అయ్యారు.. కాంతార సినిమాకు సీక్వల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. అంటే కాంతార సినిమాకు ముందు జరిగిన భాగాన్ని ఈసినిమాలో చూపించబోతున్నారు మేకర్స్. అయితే ఈ ప్రీక్వల్ షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే ముందుగా ఈమూవీ షూటింగ్ ను ఆగస్ట్ చివరి వారంలో మొదలు పెట్టాలని భావించారు.. కాని ఇప్పుడు ఈషూటింగ్ ను పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం.
మేకర్స్ కాంతారా ప్రీక్వెల్ మూవీ షూటింగ్ ని ఈ ఏడాది నవంబర్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని నవంబర్ నెలలో స్టార్ట్ చేసి అక్కడ నుంచి రెగ్యులర్ షూట్ ను నాన్ స్టాప్ గా చేయనున్నట్లు సమాచారం..ఈ ప్రీక్వల్ చిత్రం ఈ సారి భారీ బడ్జెట్ తో భారీ తారాగణం తో తెరకెక్కనున్నట్లు సమాచారం.ఈ మూవీ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మూవీ లో ఒక పాత్రకోసం రిషబ్ శెట్టి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు.. హీరో రిషబ్‌శెట్టి ఈసినిమా కోసం గుర్రపుస్వారీతో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందబోతున్నట్లు సమాచారం. మరి ఈ సారి గ్రాండ్ గా తెరకెక్కుతున్న కాంతారా 2 ప్రేక్షకులకు మరోసారి డివోషనల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!