Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Komatireddy Venkat Reddy Said That Rrr Will Pave The Way For The Golden Future Of Telangana Children

Komatireddy Venkat Reddy: ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది..

Published Date :December 28, 2024 , 9:58 pm
By Rajesh Veeramalla
  • కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం- మంత్రి
  • సీఎం చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు- మంత్రి.
Komatireddy Venkat Reddy: ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో పురోగతి లభించింది. హైదరాబాద్ నార్త్ పార్ట్‌కి కేంద్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ ఫర్ చేసింది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే కి కేంద్రం టెండర్స్ పిలిచింది. ఈ క్రమంలో.. తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు అని అభిప్రాయపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు అని తెలిపారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. అందుకోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు పిలిచింది. 27-12-2024 నుంచే టెండర్లు అందుబాటులోకి వచ్చాయి. టెండర్ల దాఖలుకు చివరి తేదీ 14-02-2025 (11.30 గంటల). 14-02-2025 తేదీన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు తెరవనుంది. ఆర్ఆర్ఆర్ కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అనేకసార్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2017లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించినా.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు వెనకబడ్డాయన్నారు. 2023 డిసెంబర్‌లో పదవి చేపట్టిన నాటి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు కోసం నిరంతరం కృషి చేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భూసేకరణపై అనేక సార్లు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ గేమ్ ఛేంజర్ అయితే, ఆర్ఆర్ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఆర్ఆర్ఆర్ కీలక భూమిక పోషించబోతుందని తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసి చేసిన కృషి ఫలించిందన్నారు. తెలంగాణలో గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగ్ రోడ్డు పనులు ఆలస్యం అయ్యాయని ఆరోపించారు. అప్పుడే యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని లేఖ ఇచ్చుంటే ఈ పాటికి రీజినల్ రింగ్ రోడ్డు పట్టాలెక్కేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. తాను స్వయంగా ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి యుటిలిటీ ఛార్జీల చెల్లిస్తామని లేఖ రాశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని వివరిస్తే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద మనసు చేసుకొని యుటిలిటీ ఛార్జీలు కూడా కేంద్రమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.

Pawankalyan OG: పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక ప్రకటన..

టెండర్ వివరాలు
1వ ప్యాకేజీ:
గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి– 1529.19 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం. 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

2వ ప్యాకేజీ:
రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి– 1114.80 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం. 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

3వ ప్యాకేజీ:
ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి– 1184.81 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం. 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

4వ ప్యాకేజీ:
ప్రజ్ఞపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి– 1728.22 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం. 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

5వ ప్యాకేజీ:
రాయగిరి గ్రామం నుంచి తంగడ్ పల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని– 1547.04 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Center calls
  • CM Revanth
  • hyderabad
  • komati reddy venkat reddy
  • RRR tenders

తాజావార్తలు

  • Vayuputra : ‘వాయుపుత్ర’కు నాగవంశీ బ్రేకులు?

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

  • Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!

  • Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions