NTV Telugu Site icon

Minister Komatireddy: వెనుకబడిన కులాలు అంటే వారికి చిన్నచూపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Minister Komatireddy Venkat Reddy: తాము ఏ కార్యక్రమం చేసినా పని పెట్టుకుని బురద జల్లుతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లకు చిన్న చూపు అంటూ మండిపడ్డారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, దళితుడు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అని వెల్లడించారు. ఫామ్ హౌస్‌లో లిక్కర్, డ్రగ్స్‌తో అడ్డంగా దొరికి పోయి దీపావళి పండుగ దావత్ చేస్తే తప్పేంది అంటున్నారని మంత్రి విమర్శించారు.

Read Also: Minister Ponnam Prabhakar: జనావాస సముదాయాల్లో టపాసుల దుకాణాలు లేకుండా చూడాలి..

హరీష్‌ రావు రుణమాఫీ చేయలేదని అంటున్నాడని.. రూ 18 వేల కోట్లతో లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో మొదటి సారి బీసీ కులగణన ఏర్పాటుకు కేబినెట్ తీర్మానం చేశామన్నారు. వెనుకబడిన కులాల మీద వాళ్లకు ప్రేమ లేదన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బీసీ కులగణనపై ప్రెస్ నోట్ అయినా విడుదల చేయాలన్నారు. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు.

Show comments