Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన చరిత్రాత్మక నిర్ణయాల గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “మేము 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు,…
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (AI) ప్రమాదకరమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఆమె దానిపై కౌంటర్ ఇచ్చారు. “AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… అనుముల ఇంటెలిజెన్స్!” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కవిత, ఈ ‘అనుముల ఇంటెలిజెన్స్’ వల్లే రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. అనుముల…
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం, ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. బీసీ కుల గణన లెక్కలు తప్పు అంటున్నారు.. ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు.
గాంధీభవన్‌లో బీసీ కులగణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగుతున్న సమావేశంలో మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు సమావేశంలో కులగణన ప్రాధాన్యతను వివరించారు.
తాము ఏ కార్యక్రమం చేసినా పని పెట్టుకుని బురద జల్లుతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లకు చిన్న చూపు అంటూ మండిపడ్డారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, దళితుడు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు బీసీ కులగణనపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇవాళ గాంధీ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లతో కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
మేము మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణననీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు.. మేము ఎవరికి వ్యతిరేకం కాదు.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు.