Minister Komatireddy Venkat Reddy: ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్‌కు లేదని.. అందుకే అసెంబ్లీ వస్తలేరు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. కొడుకు , అల్లుడు , బిడ్డలను తాము పట్టించుకోమన్నారు. డీలిమిటేషన్‌లో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు. జమిలి డ్రాఫ్ట్ రెడీ అయిందన్నారు. మా సీఎం , మంత్రులు పబ్లిక్‌కి అందుబాటులో ఉంటున్నాము ప్రతిపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిర్ రంజన్ చౌదరి పార్లమెంట్‌కి వెళ్లారన్నారు.
Read Also: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
బడ్జెట్ సమావేశాల వరకు కొత్త మంత్రివర్గం రెడీ అవుతుందని ఆయన వెల్లడించారు.కాంగ్రెస్‌లో మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి పదవులు అనేది ఎవరు చెప్పలేరన్నారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం, సీఎందే తుది నిర్ణయమన్నారు. పాలమూరు నుంచి శ్రీహరికి కచ్చితంగా మంత్రి పదవి.. ఇది మాత్రం చెప్పగలనన్నారు. నల్గొండలో 2018లో భూపాల్ రెడ్డిని వికలాంగుడు అనే సానుభూతితో గెలిపించారంటూ మంత్రి విమర్శించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఓడారు.. నేనెంత అంటూ వ్యాఖ్యానించారు. కల్వకుర్తిలో ఎన్టీఆర్ మీద చిత్త రంజన్ ఇంట్లో నుంచి గెలిచారన్నారు. తన మీద గెలిచేందుకు బూర నర్సయ్య రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని.. అయినా తానే గెలిచానన్నారు. ప్రతిపక్ష ఎంపీగా ఎన్నో రోడ్ ప్రాజెక్టులు తీసుకొచ్చామన్నారు. గడ్కరీ నిన్న సీఎంకు చెబుతూ.. వెంకన్న నాకు చోటా బాయ్ అన్నారన్నారు.