New House getting Ready for Pawan kalyan at Pithapuram: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి కొత్త ఇల్లు రెడీ అయింది. 2014వ సంవత్సరంలో జనసేన పార్టీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో బిజెపి- తెలుగుదేశం కూటమికి మద్దతు తెలిపారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను విభేదించి సొంతంగా బీఎస్పీ లాంటి కొన్ని పార్టీలతో కలిసి బరిలోకి దిగారు. దాదాపు అన్ని స్థానాల నుంచి పోటీ చేసినా కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటు మాత్రమే దక్కింది. ఇక 2024లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన -టిడిపి- బిజెపి ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి లేదా గాజువాక నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ముందు పోటీ చేస్తారు అని ప్రచారం జరిగినా చివరికి ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు.
Tillu Square : 100కి దగ్గరైన టిల్లు గాడు.. రంగంలోకి యంగ్ టైగర్..
ఇక అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగిన జనసేనాని పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని పలు సందర్భాలలో పేర్కొన్న సంగతి తెలిసిందే. పవన్ కార్యాలయం, వసతికి అనువుగా చేబ్రోలులో ఒక భవంతి తుది మెరుగులు దిద్దుకుంటోంది, ఉగాది నాడు పవన్ గృహప్రవేశం చేస్తారని అక్కడి వారు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నివాసం కోసం సిద్ధమవుతున్న భవనానికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మూడంతస్తుల ఈ భవనం నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ప్రచారం కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇక్కడ పవన్ కి ప్రత్యేక వైసీపీ వంగా గీతను బరిలోకి దించింది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలవకూడదు అని భావిస్తున్న అధికార వైసీపీ పెద్ద ఎత్తున మంత్రులను, కీలక నేతలను అక్కడ మోహరించింది. అయితే అధికార వైసీపీ ఎన్ని చేసినా తాను గెలిచి తీరుతానని పవన్ గంటాపథంగా చెబుతున్నారు.