Minister Karumuri Nageswara Rao: నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు సీఎం జగన్.. యుద్ధానికి సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Karumuri Nageswara Rao: నామీద ప్రతి పక్షాలు బురద చల్లినా.. నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ సునీల్ కుమార్ యాదవ్‌తో కలిసి పాల్గొన్న మంత్రి కారుమూరి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామీద ప్రతి పక్షాలు అనవసరమైన విమర్శలు, ఆరోపణలతో బురద చల్లినా… నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు సీఎం జగన్ అన్నారు.. ఇక, కార్యకర్తల కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాను అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప నిజాయితీ పాలన అందించారని కొనియాడారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం తణుకు అభివృద్ధికి 3,300 కోట్ల రూపాయాలు కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. మూడు కండవాలు (తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ) కప్పుకుని వస్తున్న వారిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యకర్తలు యుద్దానికి సిద్ధం అని ప్రకటించారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.
Read Also: Bramayugam: మమ్ముట్టి నట బీభత్సం.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎందులో చూడాలంటే?
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
కాగా, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్లు చేశారు మంత్రి కారుమూరి.. చంద్రబాబు అధికారంలో ఉండగా దొరికినకాడికి అడ్డంగా దోచుకున్నాడని, అందుకే జైలుకు వెళ్లాడని విమర్శించిన విషయం విదితమే.. ప్రజల దృష్టిలో నిజం అంటే వైఎస్ జగన్.. అబద్ధం అంటే చంద్రబాబు.. అనేది బలంగా ఉందన్నారు. ఇక, ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేయడంతో సీఎం జగన్ అంటే నిజం అని జనం అనుకుంటున్నారన్నారు. ఇచ్చిన ఒక్క హామీలను అమలు చేయకపోగా.. మేనిఫోస్టును కూడా మాయం చేసిన చరిత్ర అబద్ధాల చంద్రబాబుది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!