Bramayugam to Stream on SonyLIV from March 15: ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ భ్రమయుగం. ఆయన గత సినిమాలు కన్నూర్ స్క్వాడ్ వంద కోట్లు మరియు కాథల్ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా భ్రమయుగం టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ రేకెత్తించాయి. ఇక ఎక్స్‌పరిమెంటల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భ్రమయుగం ఎంతగానో ఆకట్టుకుంది. పూర్తి బ్లాక్ అండ్ వైట్ ఫార్మట్‌లో కేవలం మూడు పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో వారం ఆలస్యంగా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నా కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
Surya Kiran: చనిపోయిన సూర్య కిరణ్ ను తరిమి తరిమి కొట్టిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి.. ఎందుకో తెలుసా?
ఈ సినిమాను సితార సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరిగింది. దాదాపు 30 కోట్లకు సోనీ లివ్ భ్రమయుగం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాను ఇప్పుడు సోనీ లివ్ మార్చ్ 15 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకోగా మార్చి 15 నుంచి భ్రమయుగం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక భ్రమయుగం మూవీతో మమ్ముట్టి వరుసగా ఆరో బ్లాక్‌బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నట్టయింది. ఇక ప్రస్తుతం టర్బో సినిమాతో పాటు బజూక అలాగే మరో సినిమాను చేస్తున్నారు. ఇక రీసెంట్ గా తెలుగులో వైఎస్ జగన్ బయోపిక్‌గా తెరకెక్కిన యాత్ర 2లో మమ్ముట్టి గెస్ట్ రోల్‌లో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.