Minister Karumuri: టీడీపీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని.. మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుంచి వచ్చారని.. ప్రశ్నించారు. టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని, ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ను కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్న పాత్రుడు నడుస్తున్నాడని విమర్శించాడు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటని ప్రశ్నించారు. బీసీలు సెక్రటేరియట్ లోకి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి బీసీలకు ఎలా న్యాయం చేస్తారని అడిగారు.
అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలా.?, మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. గతంలో బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూశామని అన్నారు.బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడని.. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిదని తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారని.. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోందని కారుమూరి అన్నారు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
బీసీలను చంద్రబాబు ఓట్లేసే యంత్రాలుగానే చూవారని.. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదని వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రపంచమంతా కూడా కరోనా రాకుండా చంద్రబాబు ఆపేవారేమో ..? అని ఎద్దేవా చేశారు. తుపానులు ఆపుతానంటాడు, ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గిస్తానంటాడు, ఇలాంటి పిచ్చి మాటలు విని జనం నవ్వుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబు విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారని.. మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతని..చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జై జగన్ అంటున్నారని.. జగన్ పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదని.. ఇక ఇంటికొకరు ఏం వస్తారు అని సెటైర్లు వేశారు. కేంద్రంపై పోరాటం చేయలేక జగన్ ని విమర్శిస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!