Kakani Govardhan Reddy: నెల్లూరు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.. అయితే, బాబు ఛాలెంజ్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు నెల్లూరు వచ్చారు అంటేనే జిల్లా వాసులు బెంబేలెత్తుతారన్న ఆయన.. అభివృద్ధి ఏమీ చేయలేదు కాబట్టి సెల్ఫీ ఛాలెంజ్ అని టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ తీసి పెట్టారని ఎద్దేవా చేశారు.. సిగ్గు, శరం ఉండి ఉంటే ఐదేళ్లలో మీరు కట్టిన ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వలేదు? అని నిలదీశారు.. కమీషన్ల కోసం ఇళ్లు నిర్మించారని ఆరోపించారు.. ఇది అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం సిగ్గుచేటు.. ఈడీ విచారణ చేస్తుంటే మీ అవినీతి బాగోతం ఒక్కకొక్కటి బయటపడుతోంది.. ఐదేళ్లలో ఇళ్లు ఇవ్వలేకపోయాను అని సెల్ఫీ పెట్టాల్సింది అంటూ కౌంటర్ ఇచ్చారు.
మా ప్రభుత్వ హయాంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చామో తెలుసుకోవాలి.. సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి వద్ద సెల్ఫీ తీసుకుని సిగ్గుపడాలి అంటూ మండిపడ్డారు కాకాణి.. నువ్వు చేయలేకపోయిన పనులు మేం చేసి చూపించాం అని సిగ్గుతో చంద్రబాబు తలదించుకోవాలి అన్నారు. దరిద్రం, అరిష్టం, కరువు, కాటకాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటి ఫైర్ అయ్యారు.. అలాంటి బాబు.. సీఎం జగన్మోహన్ రెడ్డిని దరిద్రం, అరిష్టం అనడం సరికాదని హితవుపలికారు. ఓడిపోతాం అని తెలవడంతో పంచాయతీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు.. నిన్ను నమ్మి ఎంతమంది రోడ్డున పడ్డారో, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఇక, వాలంటీర్ల వ్యవస్థ గురించి చంద్రబాబు నీచంగా మాట్లాడటం దారుణమన్న ఆయన.. మీ పక్కన ప్రజలు ఉంటే 2019లో 23 సీట్లకి ఎందుకు పరిమితం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు చుట్టూ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి.. ఈయన రౌడీయిజం గురించి సిగ్గులేకుండా మాట్లాడటం ఏంటి? అంటూ ప్రశ్నించారు మంత్రి కాకాణి.. టీడీపీ సోషల్ మీడియాలో తప్ప జనాల్లో ఎప్పుడో చచ్చిపోయిందని సెటైర్లు వేశారు. నువ్వే మా నమ్మకం జగనన్న అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాం.. సమస్యల పరిష్కారానికి కొత్త మంత్రిత్వ శాఖ ఇస్తారట, అసలు ఈయన అధికారంలోకి ఎప్పుడు రావాలి? అని ఎద్దేవా చేశారు.. సర్వేలో గెలవబోమనే సీట్లని బీసీలకి ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు.. తన కూతురుని చంద్రబాబుకి ఇచ్చి పెళ్లిచేయడమే ఎన్టీఆర్ చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని చంద్రబాబు చేస్తా అన్నాడు.. ఆ పని చేస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందన్నారు.. చంద్రబాబుకు కమిట్మెంట్ అనే పదం పలకడానికి కూడా అర్హతే లేదన్న కాకాణి.. సీఎం జగన్ లాంటి వ్యక్తిని క్యాన్సర్ గడ్డ అన్నాడు.. నిలువెత్తు విషం దాచుకున్న నువ్వు జగన్ గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వై నాట్ పులివెందుల అన్నావ్.. నీ స్థాయి పులివెందుల వరకే.. మేం వై నాట్ 175 అంటున్నాం అన్నారు.. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ విషాదం.. కందుకూరులో కాలు పెట్టాడు.. 8 మంది చనిపోయారు.. అసలు 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని దమ్ముంటే చెప్పగలవా చంద్రబాబు..? అని నిలదీశారు. నెల్లూరు జిల్లాకు చంద్రబాబు చేసింది శూన్యం అని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.