Chandrababu Arrest: ‘ఇంకా చాలా మంది బయటకు వస్తారు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister kakani Govardhan Comments om Chandra Babu Naidu Arrest: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిపోయాయి. బాణాసంచా కాల్చి పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కాకాణి గోవర్థన్ స్పందించారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆయన అందుకే సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిందన్నారు . తాను ఎలాంటి తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారని, తప్పు చేసిన వారెవరూ నిజాన్ని ఒప్పుకోరని మంత్రి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ వద్ద నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అన్ని వెలుగులోకి వస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ఈ కేసుల్లో బయటకు వస్తారని కాకాణి అన్నారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
Also Read: Chandra Babu Arrest: ‘చంద్రబాబు చేసిన దాంట్లో ఇది చిన్న స్కామ్ మాత్రమే’
చంద్రబాబు అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండిస్తున్నట్లు చెప్పడాన్ని కాకాణి తప్పుబట్టారు. వారిద్దరికి ఒప్పందం కుదిరినట్లుంది అందుకే చంద్రబాబు అరెస్ట్ ను పురందేశ్వరి తప్పుబడుతున్నారని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనం దుర్వినియోగమైన పర్వాలేదని మీరు చెప్పదలుచుకున్నారా అని పురందేశ్వరి నిలదీశారు. రెండుసార్లు లోక్ సభ పోటీ చేసి పురందేశ్వరి ఓడిపోయారని అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో జతకట్టి పోటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే చంద్రబాబును తీసుకొని బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పురందేశ్వరికి లేదని తేల్చి చెప్పారు కాకాణి గోవర్థన్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?