Site icon NTV Telugu

Minister Jagadish Reddy : తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తాం

Jagadish Reddy On Modi

Jagadish Reddy On Modi

తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. నిన్న మొన్న ఒక చిన్న ఆటంకం వచ్చింది.. అందువల్ల ఇబ్బందులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 24 గంటలు కరెంటు వద్దని కొందరు ఆందోళనలు చేశారు… వద్దని బహిరంగంగా ప్రకటనలు చేశారన్నారు. మళ్లీ నిన్న మొన్న కరెంటు కోతలంటూ ధర్నాలకు కూర్చున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ వల్లే ఈ సమస్య వచ్చిందని, ఎన్టీపీసీ జనవరి 1 నుంచి 350 మిలియన్ యూనిట్ల కరెంటు ఇస్తామని చెప్పిందన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వస్తుందని అనుకున్నామన్నారు.

Also Read : Blink It: బ్లింకిట్ నిర్వాకం.. బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ప్రత్యక్షం

రెండు నెలల నుంచి ఎన్టీపీసీ మొండి చేయి చూపిస్తుందని ఆయన మండిపడ్డారు. ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదని, ట్రిప్ కావడం వల్ల రెండు పవర్ జనరేషన్ ప్లాంట్ లలో 1200 మెగావాట్ల విద్యుత్ పార్టీ ఆగిపోయిందని ఆయన వెల్లడించారు. దీనివల్ల నాలుగైదు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా.. ఇటీవల రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వాళ్ళ బతుకంతా ప్రజల జీవితాలను కూలగొట్టడమేనని, ఒకడు ప్రగతి భవన్ కూలగొడతా అంటాడు.. ఇంకొకడు సచివాలయం కూలగొడతా అంటాడు.. కేసీఆర్‌ మాత్రమే నిర్మాణం చేసే నాయకుడు అని ఆయన అన్నారు.

Also Read : Minister Malla Reddy : అసెంబ్లీలో నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి

Exit mobile version