తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లను స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక సంఘం తెలంగాణకి అప్పు ఇవ్వండి అంటే ఇవ్వలేదని, కోతలు పెట్టండి అంటే మాత్రం కోతలు పెట్టారంటూ ఆయన విమర్శించారు. 6200 కోట్లు ఆర్ధిక సంఘం గ్రాంట్స్ ఇవ్వండి అంటే ఇవ్వలేదని, కోతలు పెట్టండి అనగానే పెట్టేశారంటూ మండిపడ్డారు. బీజేపీ పాలనలో నెరవేరని హామీలు.. అన్నీ ఫెయిల్ అని, విదేశాల నుంచి నల్లధనం తెస్తామన్నారు.. ఫెయిల్.. పేదల ఖాతాల్లో 15 లక్షలు…ఫెయిల్. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు…ఫెయిల్.
పెద్ద నోట్ల రద్దు…ఫెయిల్.. రైతుల ఆదాయం రెట్టింపు …ఫెయిల్. ఎం.ఎస్.ఎం.ఈలకు గంటలోపల రుణాలు… ఫెయిల్.. అర్హులందరికీ ఇండ్లు… ఫెయిల్. మేకిన్ ఇండియా….. ఫెయిల్.. పటిష్టమైన లోక్ పాల్ బిల్లు..ఫెయిల్.. నమామి గంగే… గంగానది ప్రక్షాళన..ఫెయిల్.. నదులఅనుసంధానం…ఫెయిల్.. టెర్రరిజం కూకటి వెళ్లతో పెకలిస్తాం…ఫెయిల్. బుల్లెట్ ట్రైన్…ఫెయిల్.. హర్ ఘర్ జల్…ఫెయిల్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.