Harish Rao: ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్మడం దారుణమన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన కార్యక్రమంలో 58 జీవో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. రామచంద్రపురం 112 డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధికంగా 738 మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన నియోజకవర్గం పటాన్‌చెరు అని వెల్లడించారు.
Read Also: Robbery : రాజధానిలో బార్ ఓనర్ పై దాడి.. రూ.2కోట్లు దోపిడీ
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
అమీన్‌పూర్ మండలంలో 265, గుమ్మడిదలలో 7, జిన్నారంలో 12, పటాన్‌చెరులో 188, రామచంద్రాపురంలో 266 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీచేసినట్టు వివరించారు. గిరిజనులకు ఇచ్చిన ప్రతీ మాట కేసీఆర్ నిలబెట్టుకున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయన్నారు. 81 వేల ఉద్యోగ నియమాకాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని హరీశ్ రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం, 23 కోట్లు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ వచ్చాక 75 గిరిజన కళాశాలలు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Big Breaking: కూకట్ పల్లిలో కూలిన అంతస్తు…. శిథిలాల కింద కార్మికులు
గిరిజనులను ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా చూశారు. దేశంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 2, 471 తాండలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ కోరారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కోసం స్థలం రెడీగా ఉందన్నారు. లాంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. మతతత్వ బీజేపీ పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!