మెదక్ జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా రామాయంపేటలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మైనంపల్లి పై పరోక్ష విమర్శలు చేశారు. నా దగ్గర డబ్బులు బాగున్నాయి… పెద్ద పెద్ద కార్లు ఉన్నాయని బయలు దేరారని, డబ్బుల సంచులతో వస్తున్నారని, సంక్రాంతి పండుగ ముందు గంగిరెద్దువాళ్ళు బయలుదేరినట్టు బయలు దేరారంటూ ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ లో ధన బలానికి జన బలానికి మధ్యే పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయానికి అన్యాయానికి మధ్యే పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మళ్ళీ వస్తే కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్ల కాలం వస్తుందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనకి కాంగ్రెస్ పాలనపై చర్చ పెడుదాం అంటున్నాడని ఆయన మండిపడ్డారు.
Maharashtra: నాందేడ్ ఆస్పత్రిలో ఘోరం.. ఒక్కరోజులో 12 మంది శిశువులు, మొత్తంగా 24 మంది మృతి
అంతేకాకుండా.. ‘సోనియాగాంధీ ని బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా. ఇప్పుడు పీసీసీ కుర్చీలో కూర్చొని దేవత అంటున్నావు. 2004 నుంచి 2014 వరకు నువ్ ఏ పార్టీలో ఉన్నావు రేవంత్. ఆనాడు టిడిపిలో ఉండి కాంగ్రెస్ ని తిట్టలేదా మంత్రి హరీష్ రావు. ఆనాడు కాంగ్రెస్ పై నువ్ మాట్లాడిన మాటలు నిజమా. ఇప్పుడు మాట్లాడిన మాట నిజమా రేవంత్ రెడ్డి. నువ్వు రంగులు మార్చే ఊసరవెల్లివి. రేవంత్ రెడ్డి పై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు. డబ్బు సంచుల ముచ్చట ఒక్క రోజే. ధన బలం కాదు జన బలం ఉన్నవాళ్లు గెలుస్తారు. ఇతర పార్టీలు మాటలు చెబుతాయి… కేసీఆర్ చేసి చూపిస్తారు. సోనియాగాంధీ ని బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా.. ఇప్పుడు పీసీసీ కుర్చీలో కూర్చొని దేవత అంటున్నావు.. 2004 నుంచి 2014 వరకు నువ్ ఏ పార్టీలో ఉన్నావు రేవంత్.. ఆనాడు టిడిపిలో ఉండి కాంగ్రెస్ ని తిట్టలేదా.. ఆనాడు కాంగ్రెస్ పై నువ్ మాట్లాడిన మాటలు నిజమా.. ఇప్పుడు మాట్లాడిన మాట నిజమా రేవంత్ రెడ్డి… నువ్వు రంగులు మార్చే ఊసరవెల్లివి..’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Nama Nageswara Rao : ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నాయకులను నమ్మకండి