Harish Rao : మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. గత రెండు నెలలుగా మునుగోడు మేనియా తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎంతో ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపుపై తాజా మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. బీజేపీ కుట్రలను ఛేదించిన మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు అని అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ కుట్రలకు మధ్య జరుగుతున్న పోరాటంలో టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన నిలిచిన మునుగోడు ప్రజానీకానికి ధన్యవాదాలు అన్నారు. తెలంగాణ సమాజం తెలంగాణ పక్షాన ఉన్నదని మరోసారి రుజువైంది. మునుగోడు ప్రజలు చైతన్యానికి మరోపేరు అని నిరూపించుకున్నారు.
Also Read : Bhakthi TV Koti Deepotsavam 2022: ఏడవరోజు విశిష్టంగా సాగిన కోటి దీపోత్సవం
బీజేపీ కేంద్ర నాయకత్వానికి కర్రుకాల్చివాతపెట్టారు. ఇది ముమ్మాటికీ మునుగోడు ప్రజల గెలుపు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీ, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను తన పార్టీలో చేర్చుకొని మునుగోడుపై ఎన్నికలను రుద్దింది. • బీజేపీ అహంకారాన్ని మునుగోడు ప్రజలు అణచివేశారు. ఇదో అద్భుతసందర్భం. ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశరాజకీయాల్లో గుణాత్మకమార్పుకు మునుగోడు ఫలితం నాందివాచకం. సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన సంపూర్ణ మద్ధతుకు ఈ విజయం నిదర్శనం.
Also Read : Rajasthan: ఇదేం మూఢనమ్మకం.. కొడుకు ఆరోగ్యం కోసం కూతురును బలి ఇచ్చిన తల్లి!
అధికారం, డబ్బులు, ప్రలోభాల కన్నా ప్రజాస్వామ్యం గొప్పదని మునుగోడు ప్రజలు రుజువు చేసిన వైనం చరిత్రాత్మకం.కాంట్రాక్టులు-కమిషన్లు కాదు. విషం- విద్వేషం కాదు. తెలంగాణకు కావాల్సింది అభివృద్ది – సంక్షేమం అని మునుగోడు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన నాయకత్వ స్ఫూర్తితో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పరిశ్రమించిన తీరుకు అభినందనలు. మునుగోడు ఉపఎన్నికల్లో అన్ని వర్గాలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చిన తీరు, ఆయన నాయకత్వంపై చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు. సీపీఎం, సీపీఐ పార్టీలు మునుగోడులో ఇచ్చిన మద్ధతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
•కేసీఆర్ గారి నాయకత్వం దేశానికి కొత్త దశ- దిశ అందిస్తుందని ఈ ఉపఎన్నిక ద్వారా ప్రజలు దేశాని కొత్త సందేశం ఇచ్చారు. అందుకు వారికి మరో సారి శిరస్సు వంచి నమస్కరిస్తున్న. ఈ ఎన్నికల్లో మాకు ఆద్యంతం శక్తిని, స్ఫూర్తిని నింపిన మా నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, నాయకులకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు.’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.