Gudivada Amarnath: యువతలో దాగిఉన్న క్రీడాలను బయటకు తీయడానికి ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెచ్చిపోయారు.. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగిపోయారు.. మొత్తంగా 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించారు.. విశాఖలోని DLB గ్రౌండ్ లో ఆడుదాం-ఆంధ్రా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.. అమర్ లెవన్ కు కెప్టెన్ గా మంత్రి గుడివాడ అమర్నాథ్, KKR లెవన్ కెప్టెన్ నార్త్ కో ఆర్డినేటర్ కేకే రాజు వ్యవహించారు.. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను మంత్రి, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఆడారు..
Read Also: DK Aruna: ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారనేది ఇప్పుడు కనిపిస్తుంది..
ఇక, ఆడుదాం ఆంధ్రా క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ అద్భుత బ్యాటింగ్ చేశారు.. రెండు సిక్స్ లు, రెండు ఫోర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ ఆయన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేశారు.. మొత్తంగా అమర్ లెవెన్ వెర్సస్ కేకేఆర్ ఫ్రెండ్లీ మ్యాచ్ లో మంత్రి అమర్నాథ్ ఆసక్తికరమైన ఇన్నింగ్స్ ఆడారు.. మంచి ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడుదాం-ఆంధ్రాను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కుల, మతాలకు అతీతంగా జరిగే క్రీడలపై దుష్ప్రచారం చేయడం దూరదృష్టకరమన్న ఆయన.. విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకత్వం.. 14 ఏళ్ళు అధికారంలో వున్నప్పుడు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు..? అని నిలదీశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: Rinku Singh: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. వీడియో వైరల్!
మరోవైపు.. అట్టహాసంగా ప్రారంభమైంది ఆడుదాం-ఆంధ్రా స్పోర్ట్స్ మీట్ …. ఎన్. ఏ. డి. జంక్షన్ నుంచి DLB గ్రౌండ్స్ వరకు వైసీపీ యువజన విభాగం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది.. బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్.. ఆడుదాం-ఆంధ్రా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు క్రికెటర్ అంబటి రాయుడు.. క్రీడా నైపుణ్యాన్ని పెంపొందిస్తే.. విద్యార్థులు క్రీడల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని.. ఆడుదాం ఆంధ్రాలో అనేక క్రీడలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొందుపరిచారని.. రాష్ట్రం మొత్తం అందరు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.