Errabelli Dayakar Rao : అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు కుళ్లుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దర్దేపల్లి-కొండాపూర్ గ్రామాల బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం బృందావన్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకుర్తి అభివృద్ధికి ఎంతైనా చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా ఖర్చు పెట్టామని, మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రాంత విద్యార్థుల కోసం పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ ప్రారంభిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. పాలకుర్తి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, కేసీఆర్ హయాంలోనే ప్రాచీన దేవాలయాలకు వైభవం వచ్చిందన్నారు.
Read Also:Congress: బెంగాల్‌లో కాంగ్రెస్ ఖాళీ.. ఉన్న ఒక్కడు కూడా టీఎంసీలోకి..
సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ అభివృద్ధిని ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయన్నారు. గత, వర్తమాన పరిణామాలను బేరీజు వేసుకుని సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలన్నారు. బీసీ కులాల ఉద్యోగాలు చేస్తున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, అర్హులైన వారిని గుర్తించి త్వరలో అందజేస్తామన్నారు. అలాగే ప్రతి సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ అవసరమని, దాని నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. కార్మికులు, ప్రజలే తనకు బలం, బలమని అన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు, అభివృద్ధిని చూసి రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, మనమంతా కేసీఆర్‌ను ఆశీర్వదించామని, బీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Also:Congress: బెంగాల్‌లో కాంగ్రెస్ ఖాళీ.. ఉన్న ఒక్కడు కూడా టీఎంసీలోకి..