Site icon NTV Telugu

Minister Dadisetti Raja: సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ.. అభ్యర్థులు కూడా దొరకరు..

Dadisetti Raja On Yanamala

Dadisetti Raja On Yanamala

Minister Dadisetti Raja: చంద్రబాబు సభలో జనం లేక, ఖాళీ కుర్చీలను చూసి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు ‘రా కదలిరా’ బహిరంగ సభ అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని ఆయన అన్నారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. మా సామాజిక వర్గాన్ని అవమానపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత టీడీపీలో ఎవరూ ఉండరు అని.. అంతా ఖాళీ అయిపోతుందన్నారు. టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరన్నారు. చంద్రబాబు, లోకేశ్ లక్షలు కోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు.

Read Also: TTD: ఎట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్కియాలజీ శాఖ

1975లోనే మా భూములు 10 ఎకరాలు పంచిపెట్టామన్న ఆయన.. అప్పుడు నువ్వు తిరుపతి బస్‌స్టాండ్ లో జేబులు కొట్టే వాడివంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పది నియోజకవర్గాల నుంచి జనాలును తీసుకువచ్చావంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన గురించి తుని ప్రజలకు తెలుసన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు తుని నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. చెక్ పోస్ట్‌లో ఇచ్చే డబ్బులు ప్రభుత్వానికి వెళ్తాయన్నారు.

Exit mobile version