Botsa Satyanarayana: ఉగాది తర్వాత ఆ సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్.. ఈ 6 నెలలే అరుపులు, కేకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్.. ఈ ఆరు నెలలు మాత్రమే అరుపులు, కేకలు ఉంటాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఒక సెలబ్రిటీ రాష్ట్రం అంతా తిరుగుతూ మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిపైన అసహనం ప్రదర్శిస్తున్నారు.. 40 ఏళ్ల ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంగితజ్ఞానం ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రజలు తరిమికొడితే హైదరాబాద్ లో కాపురం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. ఇక, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని విమర్శించిన ఆయన.. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
రైతుల ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలోనే జరగలేదా..? చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అని సూచించారు బొత్స.. సెల్ ఫోన్ నేను కనిపెట్టానని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడడం లేదా? అని ఎద్దేవా చేశారు. అసలు లోకేష్ లెక్కల్లో మనిషే కాదన్న బొత్స.. సెలబ్రిటీ (పవన్ కల్యాణ్)కి టీడీపీ పాలన నచ్చడం అంటే పచ్చకామెర్ల వాళ్ళకు లోకం పచ్చగా కనిపించినట్టే అని సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో దోపిడీ.. పెత్తందారి వ్యవస్థ కనిపించలేదా.. ఋషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుందని ఏడాది క్రితమే చెప్పానని గుర్తుచేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు జరుగితే నీకేంటి నొప్పి.. అని మండిపడ్డ ఆయన.. అందుకే ప్రజలు నిన్ను హర్షించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించేస్తానంటున్నారు.. అది ఎందుకో.. దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో సెలబ్రిటీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
సంక్షేమం వైఎస్సార్ పేటెంట్.. దాని మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రి బొత్స.. ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్ అవుతుందని జోస్యం చెప్పిన ఆయన.. ఈ ఆరునెలల కాలమే అరుపులు, కేకలు ఉంటాయన్నారు. 40 ఏళ్ల ఇండస్త్రీకి 4 ఏళ్ల పాలనకి తేడా సున్నా మాత్రమే.. మేం చేసిన మంచి పనులు 100 చెప్పగలుగుతాం.. మీరు ఏం చేశారు? అని ప్రశ్నించారు. రాజధానిలో 30 వేల కోట్ల భూములు కొనేశారని మాట్లాడడానికి అది నాలుకా, తాటిమట్టా అంటు ఫైర్ అయ్యారు. ఇక, తెలంగాణలో దోపిడీకి చంద్రబాబు కారకుడన్న ఆయన.. సైకిల్ పై కాలేజ్ కు వెళ్లిన చంద్రబాబు ఆస్తులు ఎంత..? స్కూటర్ మీద వెళ్లిన బొత్స ఆస్తులు విలువ ఎంత..?.. నక్కకి.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..! అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా..? అంటూ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!