Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- న్యూయార్క్ సిటీలో దారుణం
- మేడ్చల్‌కి చెందిన యువకుడు దారుణ హత్య
- మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు అన్షుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్ సిటీలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రానికి చెందిన యువకుని దుండగులు కాల్చి చంపారు. బతుకు తెరువు కోసం అమెరికాకు వెళ్లిన యువకుడు అక్కడ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో పిజ్జా డెలివరీ ఇచ్చేందుకు వెళుతుండగా దుండగులు కాల్చి చంపేశారు. మేడ్చల్‌కి చెందిన కుంచా అన్షుల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న అన్షుల్‌ను గన్‌తో కాల్చి చంపేశారు దుండగులు. శుక్రవారం ( జూన్ 5 ) రాత్రి 12 గంటల సమయంలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గన్‌తో ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. అన్షుల్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి వాసి అని సమాచారం.
నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియాలోని ఒక ఖాళీ ఇంటికి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన కుంచ అన్షుల్‌ను దుండగులు కాల్చి చంపినట్లు తెలిపారు అక్కడి పోలీసులు. ఈ ఘటన ఎడ్జ్లీ స్ట్రీట్‌లోని 2300 బ్లాక్‌లో తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో జరిగిందని తెలిపారు. తలకి బుల్లెట్ గాయంతో అన్షుల్ కుప్పకూలినట్లు తెలిపారు పోలీసులు. అన్షుల్‌ను టెంపుల్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు నిర్దారించారని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మృతుడు అత్యంత సన్నిహితుడు కిరణ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘న్యూయార్క్ లో అన్షుల్‌ను దుండగులు తలపై కాల్పులు జరిపి హత్య చేశారు. మాకు 5వ తేదీన సమాచారం వచ్చింది. ఎమ్మెస్ పూర్తి చేసుకున్న అన్షు.. అమెరికా ఫిలతలపియలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం పనిచేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో హైదరాబాద్ వచ్చేవాడు. కానీ ఇంతలోనే దారుణ హత్యకు గురవడం బాదం కలిగిస్తుంది. రాత్రి 12 గంటలకు పిజ్జా డెలివరి చేస్తుండగా గన్నుతో ఫైర్ చేసి చంపార్ దుండగులు. గతంలో ఓసారి అమెరికాలో నల్లజాతీయులు అన్షుపై అటాక్ చేసి మొబైల్ ఫోన్, డబ్బులు దొంగతనం చేశారు. ఇప్పుడు ఏకంగా అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీలైనంత త్వరలో అన్షు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చస్తున్నా. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చాలామంది చనిపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంను సిరియస్‌గా తీసుకొని అమెరికా రాయబారితో మాట్లాడి భద్రత కల్పించాలి’ అని కోరాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!