Site icon NTV Telugu

Minister Atchannaidu: అర్హత లేని వారూ పథకాలు పొందుతున్నారు.. వారిని కట్టడి చేస్తాం..

Atchannaidu

Atchannaidu

Minister Atchannaidu: కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని.. అలా అని పథకాలను ఆపడం లేద మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వాలంటీర్లు లేరని.. సచివాలయ ఉద్యోగులతోనే కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అర్హత లేని వారు అనేక మంది పథకాలు పొందుతున్నారని, వారిని కట్టడి చేస్తామని చెప్పుకొచ్చారు. అర్హత ఉన్న వారందరికీ పథకాలు ఇస్తామన్నారు. బుడగట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. మత్స్యకారులకు ఐదేళ్లలో ఒక్క వల ఇవ్వలేదని, ఒక్క బోటు ఇవ్వలేదని.. డీజిల్ సబ్సిడీ ఇవ్వలేదని మంత్రి తెలిపారు.

Read Also: Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..

రాష్ట్రంలో బీవోటీ పద్ధతిలో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. గుజరాత్‌లో రోడ్లన్నీ నాణ్యతగా ఉన్నాయని, వాటిని పరిశీలించామన్నారు. తాము అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రం ఐసీయూలో ఉందని ఎద్దేవా చేశారు. పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు మధ్య 4 లైన్‌ రోడ్డు వేస్తే జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. కక్ష సాధింపులు, తప్పుడు కేసులు పెట్టడం మా ప్రభుత్వంలో ఉండవన్నారు. దుర్మార్గులకు దేవుడంటే భయం లేదని.. వెంకటేశ్వర స్వామి పవిత్రతను నాశనం చేశారని మండిపడ్డారు. ఐదేళ్లైంది.. లడ్డూలో వాసనే లేదని ఆరోపించారు. జంతువుల అవశేషాలు ఉన్న నూనె నెయ్యిలో కలిపారని అన్నారు. చంద్రబాబు ప్రశ్నిస్తే… సిగ్గుపడాల్సింది పోయి.. ఎదురుదాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. మేం చెప్పింది కాదు ల్యాబులు చెప్పాయని, అది మంచి నెయ్యి కాదని తెలిపాయని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని బతికి బట్టకట్టిన వారు ఎవడూ లేడన్నారు.

Exit mobile version