ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దుర్గమ్మ వారికి హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల సభ్యులు బంగారు బోనం సమర్పించారు. 500 మంది కళాకారులు విచిత్ర వేషాలు, పోతురాజులు డప్పులు, కోలాటాలతో బ్రాహ్మణ విధి నుంచి ఘాట్ రోడ్డు మీద దుర్గమ్మ చెంతకు బంగారు బోనం చేరుకుంది.
READ MORE: Rule Change From 1st July: జూలై 1 నుంచి కొత్త రూల్స్.. ఏమేం మారనున్నాయంటే?
దేవస్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ కళారూపాలైన చిన్నారుల నెమలి నృత్యం, కరగం నృత్యం, తప్పెట్లు, కోలాటం, సంప్రదాయ భజనలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలు పాడిపంటలతో, సుఖశాంతులతో, అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లాలని బంగారు బోనం సమర్పించారు. దుర్గగుడికి చేరుకున్న బంగారు బోనాన్ని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు మేరకు, బోనం సమర్పించడానికి తెలంగాణ నుంచి వచ్చిన కమిటీ సభ్యులకు, భక్తులకు ఏటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ వి. కె.శీనా నాయక్ స్పష్టం చేశారు. బంగారు బోనం సమర్పణ కోసం చేసిన ఏర్పాట్లపై మంత్రి ఆనంకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
READ MORE: Amit Shah: పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
