ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మకు హైదరాబాద్‌లోని మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బంగారు బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమీటీ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారీ వెల్లడించారు. మేళతాళాలతో , కోలాటాలతో, బేతాల వేషాలతో బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి…